టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే అది ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఆసక్తి అందరి లో నెలకొంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే  వాళ్ళ సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా వస్తుంది వారి కాంబినేషన్ లో. దీని కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా దాదాపుగా రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త టాలీవుడ్ లోహల్చల్ చేస్తుంది. అది ఏంటీ అంటే తారక్ తో త్రివిక్రమ్ కొత్త ప్రయోగం చేస్తున్నాడు అని అంటున్నారు. తారక్ ని ఒక గ్రామ సర్పంచ్ గా చూపించే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నాడు అని ఇందులో ద్విపాత్ర ఉంటుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. దీనికి సంబంధించిన కథ లో కూడా చిన్న చిన్న  మార్పులు ఉంటే దర్శకుడు చేసాడు అని  తారక్ కూడా ఆ మార్పులను చెప్పాడు అని సమాచారం. ఇక ఇప్పుడు ఇది ఒక కొత్త ప్రయోగం అని ఇలాంటి ప్రయోగం టాలీవుడ్ లో కొత్తగా ఉంటుంది అని అంటున్నారు మరి. 

 

ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ఎన్టీఆర్ చాలా వరకు బిజీ గానే ఉన్నాడు. అతను చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. దీనితో త్రివిక్రమ్ తో ఈ సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఎప్పుడు వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: