న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. యంగ్ టాలెంట్ అద్భుతాలు చేస్తుందని నిరూపించిన దర్శకుల్లో ‘శ్రీనివాస్ అవసరాల’ కూడా ఉన్నాడు. 2008లో అష్టాచెమ్మా సినిమాతో నటుడిగా పరిచయమైనప్పుడు అతనిలో ఓ దర్శకుడు ఉన్నాడని ఎవరూ ఊహించలేదు. కానీ.. తన రచన, దర్శకత్వం ఎలాంటిదో 2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉండే ప్రేమకథనే తర దర్శకత్వపు తొలి అడుగుకు ఉపయోగించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన ఈ సినిమా విడుదలై నేటికి 6ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

సినిమా 2014 జూన్ 20న విడుదలైంది. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు యువతీ యువకుల పరిచయం.. నుంచి ప్రేమ, పెళ్లిని దర్శకుడు చాలా అందంగా తెరకెక్కించాడు. న్యూస్ రీడర్ కావాలనుకుని ఓ చానెల్ లో టెలిషాపింగ్ యాంకర్ చేస్తాడు నాగశౌర్య. ఆ చానెల్ అధిపతిగా శ్రీనివాస్ అవసరాల నటించాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మధ్యలో వచ్చే ట్విస్టులు, సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వెంకటేశ్వర రావు-ప్రభావతి పాత్రల్లో నాగశౌర్య, రాశిఖన్నా ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరిద్దరూ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

IHG's Proposal - Oohalu ...

 

సహజమైన సంభాషణలు, పాత్రలు.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా చూసే ఆడియన్స్ కు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే అయినా ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. కల్యాణీ మాలిక్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్. పాటలన్నీ వీనులవిందుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్రెజెంట్ చేసింది. సినిమా థీమ్ పాతదే అయినా శ్రీనివాస్ అవసరాల ప్రెజెంట్ చేసిన తీరే కొత్తగా ఉండి సినిమాను హిట్ చేసింది. వారాహీ చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

IHG


మరింత సమాచారం తెలుసుకోండి: