ఇప్పుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత ఆదివారం తన  నివాసం లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అతను ఎందుకు అలా చేసాడు అనేది ఎవరికి అర్ధం కాలేదు. అయితే అతని మీద బాలీవుడ్ స్టార్ హీరోల పెత్తనం ఎక్కువగా ఉంది అని అందుకే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని పలువురు పదే పదే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే హాట్  టాపిక్ గా నడుస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి లో. 

 

ముఖ్యంగా అతను ఆత్మహత్య చేసుకోవడానికి గాను ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ అదే విధంగా కరణ్ జోహార్  వంటి వారు కారణం అని వారి కారణం గానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు వారిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు ఫాన్స్. ప్రధానంగా అలియా భట్ అలాగే కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ ను అన్ ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే సంజయ్ లీలా బన్సాలి ని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు. 

 

మరి ఇది ఎందుకు అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు గాని అతన్ని వాళ్ళు మానసికంగా వేధించారు అని అది భరించలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని వాళ్ళే అతని ఆత్మహత్యకు కారణం అని సుశాంత్ కి వచ్చిన మంచి ఆఫర్స్ ని  కరణ్ జోహార్ లాక్కుని మరో హీరోకి ఇచ్చాడు అని దీనిని సుశాంత్ ఏ మాత్రం తట్టుకోలేదు అని అంటారు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని బాలీవుడ్ లో కూడా టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: