ఓటీటీ ఫ్లాట్ ఫారం అంటే చులకన ఉన్నట్లుంది. అందుకే సినిమా హాళ్ళలో మంచిగా కలెక్షన్లు వచ్చే సినిమాలను ఎంత బేరం పెట్టినా రిలీజ్ చేయడం లేదు. కానీ పెద్దగా నమ్మకం లేని సినిమాలనే ఇక్కడ వదులుతున్నారని అంటున్నారు. ఇలాంటి సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద రిలీజ్ చేయడం వల్ల దానికి కూడా క్రేజ్ పడిపోతోంది.

IHG

ఈ సంగతిని కాస్తా ఆలస్యంగా గ్రహించిన ఓటీటీ నిర్వాహకులు ఇపుడు గట్టిగా ఆలోచన చేస్తున్నారు. నిజానికి డబ్బు, కలెక్షన్లు, గ్లామర్ వంటివి పక్కన పెడితే ఓటీటీలో చూసే ఆడియన్సే ఎక్కువగా ఉంటారు. ఇక బొమ్మ బాగుంటే ఆ టాక్ కూడా వేరేగా ఉంటుంది. కానీ ఎందుకో మొదటి నుంచి మనవాళ్లకు ఓటీటీ అంటే అదోరకమైన ఆలోచనా ఉండడంతో దాన్ని చిన్నచూపు చూస్తున్నారు.

IHG

దాంతో సినిమా హాళ్ళలో మన బొమ్మ ఆడదు అనుకున్న వారంతా ఇటు రావడంతో నాసిరకం సినిమాలే ఓటీటీకి వచ్చి పడుతున్నాయి. ఇలా కుప్పలు తెప్పలుగా వచ్చే సినిమాలను కొని ఆడియన్స్ ని అలరింపచేయడం కష్టమేనని కూడా ఓటీటీ నిర్వాహకులు  భావిస్తున్నారుట.

IHG

ఇపుడు లాక్ డౌన్ వల్ల థియేటర్లు తెరచుకోవడంలేదు, రేపు తెరచుకుంటే అక్కడే బొమ్మ ఆడించుకోవచ్చు అనుకున్న వారు ఓటీటీని పెద్దగా పట్టించుకోవడంలేదు. మా సినిమాల బడ్జెట్ కంటే ఓటీటీ పెట్టుబడి చాలా తక్కువ. మమ్మల్ని కొనగలరా అని ఓ బడా నిర్మాత ఈ మధ్య ప్రశ్నించారు. 

IHG

ఇక్కడ ఒకరు కొనడం అమ్మడం అని ఎందుకు అనుకోవాలి. ఇది కూడా వ్యాపారమే. బొమ్మ బాగుండే లాభాలు అవే వస్తాయి. మరి ఆ దిశగా ఆలోచన చేయకపోవడం వల్లనే అప్టూ డేట్ కాలేకపోతున్నారు అంటున్నారు. ఓ మంచి ఫ్లాట్ ఫారం ఇపుడు నాసిరకం మూవీస్ తో చెత్త డబ్బాగా మారుతోందన్న విమర్శలు ఉన్నాయి. ముందుకు ముందు ఓటీటీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: