ఇప్పుడు  మన తెలుగులో నభా నటేష్ గురించి కాస్త చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పాప చేసిన యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. చాల బాగా  నటించింది కనపడిన కాసేపు అనే సంగతి తెలిసిందే. ఇక ఆమె నటన చూసి ఇతర హీరోయిన్ లు కూడా కాస్త షాక్ అయ్యారు అని అంటారు కొందరు. అంత వరకు లేకపోయినా సరే నటనకు ప్రాధాన్యత ఉన్న కథ అయితే తాను చాలా బాగా నటిస్తా అని పాప ఈ సినిమా ద్వారా చెప్పేసింది అనే విషయం అయితే అర్ధం అయింది జనాలకు. 

 

ఇక ఈ సినిమాలో ఆమె చాలా వరకు హాట్ గా కూడా కనపడిన సంగతి తెలిసిందే. హాట్ గా కనపడటమే కాదు క్యూట్ గా కూడా కనపడింది ఆమె. ఇప్పుడు పాపకు మంచి అవకాశం వచ్చింది అని సమాచారం. తారక్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెకు మంచి ఛాన్స్ వచ్చింది అని ఫస్ట్ హాఫ్ లో ఆమెకు ఒక పాత్ర త్రివిక్రమ్ ఇచ్చాడు అని సమాచారం. ఆమె తెలంగాణా అమ్మాయి గా కనపడుతుంది అని సమాచారం. తెలంగాణా ఏరియా లో ఒక సర్పంచ్ కుమార్తె గా ఆమె కనపడుతుంది అని ఆమె అందుకు డబ్బింగ్ కూడా చెప్తాను అని చెప్పింది అని టాక్. 

 

దీనితో ఇక ఆమెను తీసుకోవడానికి గానూ త్రివిక్రమ్ రెడీ అయ్యాడు అని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఈ సినిమాలో తారక్ నటించాలి అంటే మాత్రం కచ్చితంగా ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమాలో నటించడం అనేది సాధ్యమవుతుంది అని చెప్పాలి. మరి ఆ సినిమా ఎప్పుడు అవుతుంది అనేది చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: