వారసత్వం అనేది సినిమా అయినా.. వ్యాపారమైనా.. రాజకీయమైనా.. ఎక్కడైనా ఉండేదే. ముఖ్యంగా.. సినిమా రంగంలో వారసత్వానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. కామెడీ సినిమాలకే కాకుండా సెంటిమెంట్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ఈవీవీ. తన ఇద్దరు కుమారుల్ని కూడా సినిమా ఇండస్ట్రీలోనే హీరోలుగా పరిచయం చేశారు ఈవీవీ. పెద్దబ్బాయి ఆర్యన్ రాజేశ్ ను ‘హాయ్’ సినిమాతో స్వీయ దర్శకత్వంలోనే పరిచయం చేశారు. చిన్నబ్బాయి నరేశ్ ను ‘అల్లరి’ సినిమాతో రవిబాబు దర్శకత్వంలో పరిచయం చేశారు.

IHG

 

వీరిద్దరిలో ఆర్యన్ రాజేశ్ పలు సినిమాల్లో హీరోగా చేసాడు. కానీ.. నరేశ్ మాత్రం ‘అల్లరి’ సినిమా ద్వారా మంచి సక్సెస్ సాధించాడు. అక్కడి నుంచి నరేశ్ వెనుతిరిగి చూడలేదు. అల్లరి నరేశ్ గా తెలుగు సినిమాల్లో రాజేంద్రప్రసాద్ తర్వాత అల్లరి నరేశ్ అనే పేరు తెచ్చుకున్నాడు. కామెడీ సినిమాల హీరోగా రాజేంద్రుడి స్లాట్ ను పర్ఫెక్ట్ గా ఈ జనరేషన్ లో ఫిల్ చేశాడు. ఏకంగా కామెడీ సినిమాల హీరోగా 50 సినిమాలు చేశాడంటే అల్లరి నరేశ్ ఎంత హిట్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. దీంతో సినిమాల్లో ఈవీవీ వారసుడిగా దర్శకత్వం చేయకపోయినా సినిమాల్లో హీరోగా సక్సెస్ అయ్యాడు.

IHG

 

ఈవీవీ దర్శకత్వంలోనే పలు సినిమాలు చేశాడు. అల్లరి నరేశ్ సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే.. టీవీల్లో జబర్దస్త్ కార్యక్రమం ఎంట్రీ తర్వాత తెలుగు స్క్రీన్ పై కామెడీ సినిమాల హవా తగ్గింది. దీంతో అల్లరి నరేశ్.. సినిమాల సక్సెస్ రేట్ తగ్గినా హీరోగా మాత్రం సక్సెస్ అయ్యాడు. ఈవీవీ తన సినిమాలతో నవ్విస్తే.. నరేశ్ తానే నవ్వించి ప్రేక్షకుల్ని నవ్వుల జల్లుల్లో ముంచెత్తి ఈవీవీ సినీ వారసత్వాన్ని ఘనంగా చాటాడు.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: