రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రభాస్, బ్లాక్ షర్ట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ప్రభాస్ పాల్గొనడంతో ఆఫోటోలు లీక్ అయ్యాయి. ఇక యోగ దినోత్సవం సందర్బంగా అందరూ రోజు యోగ చేయాలని ప్రభాస్  పిలుపునిచ్చాడు. 
ఇదిలావుంటే ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు.  సోమవారం ఫస్ట్ లుక్  వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈసినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  రాధే శ్యామ్ అనే టైటిల్ ను పెట్టినట్లు సమాచారం.
 
త్వరలో ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా విడుదలచేయనున్నారు. రాధే శ్యామ్ లో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈచిత్రానికి  ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: