సుకుమార్ ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా అల్లు అర్జున్ ని స్టార్ హీరో చేసింది. అంతేకాదు దర్శకుడిగా సుకుమార్ ఈ ఒక్క సినిమాతో అల్లు అరవింద్, దిల్ రాజు, అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్, రత్నవేలు కి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఇక ముఖ్యంగా ఆర్య సినిమాతో సుకుమార్ గొప్ప దర్శకుడు అన్న ప్రశంసలు అందుకుంటున్న సమయంలో సుకుమార్ తండ్రి తిరుపతి రావు నాయుడు పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మొట్ట మొదటి సినిమా అది కూడా మెగా ఫ్యామిలీ హీరో..స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు..మరో స్టార్ ప్రొడ్యూసర్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ...ఇన్ని ఒత్తిడి ల మద్య సుకుమార్ గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 

 

IHG

ఆ తర్వాత నుండి సుకుమార్ తీసే ప్రతీ సినిమాకి ఒక లెక్కుంటుంది. హీరోని ఎలా చూపించాలి...సినిమాని ఎలా తెరకెక్కించాలి..కొత్త రికార్డులు ఎలా క్రియోట్ చేయాలి...ఇలాంటి లెక్కలు సుకుమార్ కి బాగా తెలుసు. కథ ఏదైనా.. కథాంశం ఎలాంటిది రాసుకున్నా...హీరో ఎవరైనా ..సుకుమార్ లెక్క ఒక్కటే .. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడమే. సుకుమార్ ఎంచుకునే ప్రతీ కథ వెనక నిజ జీవిత పాత్రల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సహజత్వానికి అద్దం పడుతుంది. సినిమాని క్లాస్ గా తీసినా రంగస్థలం వంటి సహజమైన కథ రూపొందించినా సుకుమార్ స్టైల్ ఆ సినిమా మీద ఖచ్చితంగా ఉంటుంది. 

 

IHG

ఇక సుకుమార్ తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిండొచ్చు..కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించవచ్చు..కాని ప్రతీ సినిమాని ఒకే లెక్కతో తీయడం తప్ప రెండో లెక్క తెలియని డైరెక్టర్. ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా కొన్ని సినిమాల విషయంలో సన్నివేశాల విషయంలో సుకుమార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారంటే సుకుమార్ ఆలోచనా విధానం ఒక సీన్ రాసేటపుడు ..ఆ సీన్ వెండితేరమీదకి తీసుకు వచ్చేటప్పుడు ఎంతటి మానసిక శ్రమ ఉంటుందో ఊహించవచ్చు. ఇందుకు ఉదాహరణ మర్యాదరామన్న సినిమాలో సునీల్ మీద రాజమౌళి తీసిన సాంగ్ కి  సుకుమార్ ఆర్య 2 లో "ఉన్న ఉప్పెనంత ఈ ప్రేమకి" సాంగ్ ఇన్స్పిరేషన్. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి నే వెల్లడించాడు.

 

IHG

ఇలా ప్రతీ సినిమాకి ఒక ప్రత్యేకత ఉన్న సుకుమార్ కి నాన్నకు ప్రేమతో సినిమా మాత్రం ఆయన జీవితం అని చెప్పాలి. ఈ సినిమా తెరకెక్కించినన్ని రోజులు సుకుమార్ తో పాటు ఎన్.టి.ఆర్ ఒక ఎమోషనల్ జర్నీ చేయడం విశేషం. నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ తండ్రీ కొడుకుల మద్య రాసిన సన్నివేశాలకి ఎన్.టి.ఆర్ పర్ఫార్మ్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు చాలానే. వాస్తవంగా సుకుమార్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో అనుకున్న కథ వేరే. 

 

IHG

ఇంకొన్ని రోజుల్లో సెట్స్ మీదకి వెళ్ళడానికి యూనిట్ మొత్తం సిద్దంగా ఉంది. ఇంతలో సుకుమార్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో సుకుమార్ తండ్రి పక్కన ఉన్న ప్రతీ క్షణం మరపురానిది. ఒకవైపు దుఖం లో ఉన్న సుకుమార్ కి పరిస్థితి చేయి దాటిపోతుందని తెలుస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే సుకుమార్ ఎన్.టి.ఆర్ కి తన మనిషితో కబురు పంపాడు. ఇప్పుడు అనుకున్న కథ సినిమా చేయడం లేదు...సుకుమార్ వచ్చి వేరే కథ చెప్తా అన్నాడు అని.. అదే ఈ "నాన్నకు ప్రేమతో".

 

IHG

ప్రతీ కొడుకు జీవితంలో హీరో తండ్రి. సుకుమార్, ఎన్.టి.ఆర్ ఇదే ఎమోషన్ తో నాన్నకు ప్రేమతో తీశారు. ఈ సినిమా సుకుమార్, ఎన్.టి.ఆర్ ఇద్దరికి జీవితంలో ఎంతో ప్రత్యేకం.. జీవితాంతం మర్చిపోలేనిది. ఇక ఈ సినిమా చూసిన కోట్ల మంది గుండె బరివెక్కి ఏడ్చిన సందర్భాలున్నాయంటే తండ్రీ కొడుకుల మద్య అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరు నమ్మాల్సిందే. ఇదే నాన్నకు ప్రేమతో సుకుమార్ నాన్న కి కొడుకుగా ఇచ్చిన బహుమతి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: