గత కొన్ని రోజులుగా బాలీవుడ్ అట్టుడికిపోతుంది. సుశాంత్ సింగ్ బలవన్మరణం వారసత్వాలపై అనేక ప్రశ్నల్ని బయటకి తీసింది. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది వారసత్వాలపై వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నారు. బాలీవుడ్ లో నెపోటిజం రాజ్యమేలుతుందని, వారసత్వంగా వచ్చే వారు అవకాశాలు తన్నుకుపోతున్నారని, ఫలితంగా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని టాలెంట్ మరుగున పడిపోతుందంటూ విభిన్న వాదనలు వినబడుతున్నాయి.

 


బాలీవుడ్ లోని బంధుప్రీతి వల్ల చాలా మంది యువ నటీనటులు డిప్రెషన్ కి గురవుతున్నారని, సుశాంత్ సింగ్ కూడా అలాంటి బాధనే అనుభవించి ఉంటాడని, అందువల్లే బలవన్మరణానికి సిద్ధపడి ఉంటాడని సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ వారసులని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలని సంధిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.

 

అదే కాదు ఇటు నెటిజన్లు సైతం బాలీవుడ్ వారసులను అన్ ఫాలో చేస్తూ తమ వ్యతిరేకతని వెలిబుచ్చుతున్నారు. అయితే తాజాగా దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా తన ట్విట్టర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనసు ప్రశాంతంగా ఉండాలంటే నెగెటివిటీకి దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే ట్విట్టర్ కి దూరమవ్వాలి. అందుకే ఈ రోజు నుండి నా ట్విట్టర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేస్తున్నానంటూ మెసెజ్ పెట్టింది.

 

దీంతో సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేయడానికి కారణం ఈ విమర్శలని తట్టుకోకపోవడం వల్లే అని అంటున్నారు. సోనాక్షిసిన్హా కూడా బాలీవుడ్ వారసత్వం వల్లే ఇండస్ట్రీకి వచ్చిందని అందరికీ తెలుసు. నెపోటిజంపై వస్తున్న అనేక విమర్శల నుండి దూరంగా ఉండడానికే సోనాక్షి సిన్హా ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ బాటలో ఇంకెంత మంది నడుస్తారనేది ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: