కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాల్లో కనిపించినా తగినంత గుర్తింపు రాదు. అలాగే మరికొందరేమో ఒక్క సినిమాలో కనిపించగానే అమాంతం పాపులారిటీ వచ్చేస్తుంది. వరుసగా సినిమాలు అవకాశాలు తన్నుకుంటూ వస్తుంటాయి. ఇక మరికొందరు హీరోయిన్లేమో అసలు సినిమానే రిలీజ్ కాకుండానే పాపులర్ అయిపోతుంటారు. అలాంటి క్యాటగిరీలోకి వచ్చే హీరోయిన్ క్రితిశెట్టి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన సినిమాలో క్రితిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

IHG


సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇందులో నటిస్తున్న హీరోయిన్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఉప్పెన సినిమా నుండి ధక్ ధక్ ధక్ అనే పాట వీడియో ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుండి అమ్మడి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

IHG

ఆమె పాటలో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేసాయి. ఆమె కళ్లలోనిమెరుపు కుర్రకారు గుండెల్లోకి దూసుకుపోయింది. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్లు వచ్చాయి. ఉప్పెన సినిమా ఖచ్చితంగా ఉప్పెన సృష్టిస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాఫీ కప్పుతో గులాబీ రంగు డ్రెస్సులో, ముఖంపై అందమైన చిరునవ్వుతో ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంది.IHG

అందాల క్రితిశెట్టి కాఫీ కప్పుతోనూ ఉప్పెన సృష్టించేస్తోందని కామెంట్లు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఉప్పెన సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో చేస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: