కరోనా సృష్టిస్తున్న గందరగోళంలో సినిమా థియేటర్లు మూడునెలల నుండి మూసుకునే ఉన్నాయి. కరోనా విజృంభణ వేగంగా పెరుగుతుండడంతో మరికొన్ని రోజులు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి మనదేశంలో అన్ లాక్ దశ నడుస్తున్న నేపథ్యంలో మరో రెండు నెలల్లో థియేటర్లు తెరుచుకుంటాయని ఆశాభావం  వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పడు కూడా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఖచ్చితంగా చెప్పలేం.

IHG's Performance in Penguin

 

అందువల్ల ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకి సరైన స్పందన రాలేదు. లాక్డౌన్ మొదటి నుండి ఇప్పటి వరకూ రిలీజైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగల్ వంధాల్, హిందీలో గులాబీ సితాబో చిత్రాలకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి.

 

IHG

అయితే వీటన్నింటి నడుమ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూసారు. ఆ ఆశలన్నింటినీ అడియాసలు చేస్తూ పెంగ్విన్ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలపై ఒకరకమైన అభిప్రాయం ఏర్పడింది.

IHG's Haveli  Is The PERFECT Place To Spend

 

 

అన్నీ ఫ్లాప్ చిత్రాలే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయేమో అన్న భావన ప్రేక్షకుల్లో మెల్లమెల్లగా కలుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ యాజమాన్యాలు కూడా ఆలోచనలో పడ్డట్టు సమాచారం. దీంతో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇతర చిత్రాలపై కూడా ఆసక్తి కనబర్చకుండా ఉండే పరిస్థితి తలెత్తుతుంది. మరికొన్ని చిత్రాలకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఓటీటీ అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: