సాధార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో `వారసత్వం`కు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవును! ఇక్కడ వారసత్వం ఉంటే చాలు... ఎలాగో అలా ఇండస్ట్రీలో బండి లాక్కురావ‌చ్చు. అలా అని వారికి టాలెంట్ లేదు అని చెప్ప‌డం క‌రెక్ట్ కాదు. కాని, వారసత్వం ఉంటే ఇండ‌స్ట్రీలో ఎంట్రీ సులభం అని చెప్పొచ్చు. అవకాశం వస్తేనే కదా తమ టాలెంట్ నిరూపించుకునేది. ఇక ఇక‌ప్ప‌టికే హీరోలు, దర్శకులు మరియు నిర్మాతల తనయులు హీరోలు అయ్యారు.. అవుతున్నారు. 

IHG

అందులో కొందరు ఫుల్ సక్సెస్‌తో రన్ అవుతుంటే.. కొందరు మాత్రం రేస్‌లో వెన‌కే ఉన్నారు. అయితే అలా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచుకున్న హీరోల్లో నందమూరి క‌ళ్యాణ్ రామ్ కూడా ఒక‌రు. నంద‌మూరి హరికృష్ణ..  నందమూరి తారక రామారావు మూడో కుమారుడు అయిన ఈయ‌న అటు సినిమా రంగంలోనూ.. ఇటు రాజ‌కీయ రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేశారు. ఈయ‌న సినిమాలు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోరు అంటే అతిశ‌యోక్తి కాదు. 

IHG

ఇక హ‌రికృష్ణ త‌న‌యులుగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ సినిమా రంగంలో బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ విష‌యానికి వ‌స్తే.. హ‌రికృష్ణ వార‌స‌త్వాన్ని అందుకుని `తొలిచూపులోనే` సినిమాతో హీరోగా పరిచయమైన ఈయ‌న‌ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నంద‌మూరి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టినా... తాత, తండ్రి, బాబాయి, సోదరుల పేర్లు ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. 

IHG

మ‌రియు  వివాదాలకు, రాజకీయాలకు దూరంగా తన పనేంటో తాను సైలెంట్ గా చేసుకుపోతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగానే కాక పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన జైలవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. అప్ప‌ట్లో క‌ళ్యాణ్ రామ్ కూడా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ తమ్ముడితో సినిమా నిర్మించి మంచి విజయాన్ని అందుకుని తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టాడు.
 
 
 

 


 
   

మరింత సమాచారం తెలుసుకోండి: