ఓ దివ్యాంగ అభిమాని టాలెంట్​కు ఫిదా అయ్యారు బాలీవుడ్​ స్టార్​హీరో అమితాబ్​ బచ్చన్​. ఆయుష్​ అనే ఆ చిత్రకారుడి ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వదించారు బిగ్​ బచ్చన్​. తనకు బహూకరించిన ఓ పెయింటింగ్​ను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

 

 

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​కు అభిమాని అయిన ఆయుష్​ అనే దివ్యాంగుడు.. తన కాళ్లతో బిగ్​ బచ్చన్​ పెయింటింగ్​ గీశాడు. అది చూసిన అమితాబ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైన అతడి టాలెంట్​కు ఫిదా అయిపోయారు. ఇటీవలే విడుదలైన 'గులాబో సితాబో'లోని ఓ చిత్రాన్ని యువ కళాకారుడు ఆయుష్​ గీసినట్లు.. స్వయంగా తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించారు బిగ్​బీ.

IHG

 

ప్రస్తుతం సాధారణ మనిషి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే చాలా మంది చూసి దానికి స్పందిస్తారు.. అలాంటిది స్టార్​హీరో అమితాబ్​ బచ్చన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఎంత మంది చూసి తమ అభప్రాయాలను చెబుతారు..ఈ పోస్ట్ కు పెట్టిన మొదటి గంటలోనే 68.6 లైక్స్ వచ్చాయి.. అంతకు మించి అభిమానులు కామెంట్ లతో ఆయుష్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

 

చాలా మంది అభిమానులు అమితాబ్​ బచ్చన్ తొందరలో ఓ పెద్ద హీరోతో చివరి వరుకు ఉండే రోల్ చేస్తున్నారు అని బీ- టౌన్ లో పెద్ద టాక్ నడుస్తుంది. దాని గురుంచి వివరాలు చెప్పాలి అంటూ అమితాబ్ బచ్చన్ కు అభిమానులు ప్రశ్నలు పంపించారు...ఈ సినీ ప్రపంచం లో జరిగినది గోరు అంత అయితే చూపించేది కొండ అంత కదా అదే కధ పెద్ద హీరోలు సినిమా ఫిక్స్ అవ్వక ముందే ఆ సినిమా గురుంచి అనేక వార్తలు అత్యంత వేగంగా  తిరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: