మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రస్తుత ఉత్తమ హీరోల్లో ఒకడిని నిస్సందేహంగా చెప్పవచ్చు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ ఎన్నో సందర్భాలలో నిరూపించాడు కూడా. అప్పట్లో చిరంజీవి తెలుగు పరిశ్రమకి డాన్స్ స్టెప్పులు నేర్పిస్తే... ఇప్పట్లో రామ్ చరణ్ ఆ స్టెప్పులను ఇరగదీసేస్తున్నాడు. చిరంజీవి, సురేఖ దంపతులకు 1985 మార్చి 27వ తేదీన మద్రాస్ లో రామ్ చరణ్ జన్మించాడు. ఇతనికి సుస్మిత, శ్రీజ అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. అయితే చిరంజీవికి కొడుకు రామ్ చరణ్ అంటే మిక్కిలి ఇష్టం. కొడుకు పై తనకున్న ప్రేమ ఆప్యాయత ఎన్నో సందర్భాలలో బయట పడింది. 

IHG
రామ్ చరణ్ యుక్త వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా కార్లపై శ్రద్ధ చూపే వాడు. కార్ల బొమ్మలు గీయడం కార్లని విప్పడం బిగించడం లాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. చిరంజీవి కూడా చెర్రీ ఇష్టానికి గౌరవం ఇచ్చి పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. రామ్ చరణ్ మంచి క్రికెటర్ కూడా అవ్వాలి అనుకున్నాడు. ఆ తపనతోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జూనియర్ రంజీ క్రికెట్ ఆడి తనలో మంచి క్రికెటర్ ఉన్నాడని చెప్పకనే చెప్పేశాడు. కార్లపై ఇష్టంతోనే జర్మనీ వెళ్లి ఆటోమొబైల్ మెకానికల్ కాలేజ్ లో చదువుకుంటానని తన తండ్రికి రామ్ చరణ్ చెప్పగా... చిరంజీవి తన కొడుకు ఇష్టానికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి వెంటనే ఓకే చెప్పేసాడు. 

IHG
కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని, అల్లుడు అల్లు అర్జున్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేసి పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ లను చేసానని, అలాంటిది తన వారసత్వం నుండి తన కొడుకుని హీరో చేయకపోతే ఎలా అనే ఆలోచనలో చిరంజీవి ఉండేవాడు. తనలో ఆ కోరిక ఉన్నప్పటికీ సినిమాల గురించి ఎప్పుడు కొడుకు తో మెగాస్టార్ మాట్లాడేవాడు కాదు. ఒకానొక సమయం లో రాంచరణ్ కి సినిమాలపై ఇష్టం కలగాలని పెద్ద పెద్ద దర్శకులని తన ఇంటికి రప్పించి రామ్ చరణ్ తో మాట్లాడించేవాడు. ఆ క్రమంలోనే సూపర్ క్రేజ్ ని,  పాపులారిటీని తెచ్చిపెట్టే సినీ పరిశ్రమని వదిలేసి విదేశాలకు వెళ్లడం ఎందుకనే ఆలోచనలో రామ్ చరణ్ పడిపోయాడు. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి నేను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను అని చెప్పగానే చిరంజీవి లోపల సంతోషపడినా బయటకు మాత్రం షాక్ అయినట్టు ప్రవర్తిస్తూ నీకు మనస్ఫూర్తిగా సినిమాల్లో నటించాలని ఉందా అని రెండు మూడు సార్లు అడిగి కన్ఫామ్ చేసుకొని ఆ తర్వాత ఓకే చెప్పేసాడు. 

IHG
రామ్ చరణ్ సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసిన సమయంలో కూడా చిరంజీవి అతడి వెన్నంటే ఉంటూ ధైర్యం చెప్పి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వాస్తవానికి చిరంజీవి రామ్ చరణ్ ని ప్రేక్షకుల్లో కి తీసుకెళ్లినట్టు ఏ స్టార్ హీరో తన పిల్లలను సినీ పరిశ్రమకు పరిచయం చేయలేదని చెప్పుకోవచ్చు. చిన్నతనం లో కూడా రామ్ చరణ్ ని ఎంతో ప్రేమతో చాలా గారాబంగా చూసుకునేవారు. అందుకే రామ్ చరణ్ కి చిరంజీవి అంటే అత్యంత ఇష్టం. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావన లేకుండా ఇరువురి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే తండ్రి కొడుకులైన రామ్ చరణ్, చిరంజీవి... మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలలో కలిసి నటించి మెగా అభిమానులకు పెద్ద కన్నుల విందు చేశారు. ఇప్పటికీ తన తండ్రిని రెస్టారెంట్ల కి, కెఫెటేరియా లకు రామ్ చరణ్ తీసుకెళ్తాడు అంటే అతడికి తన తండ్రి పై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోంది. ఏదేమైనా తెలుగు పరిశ్రమలో తండ్రి కొడుకులైన చెర్రీ, చిరుల మధ్య అనుబంధం చాలా గొప్పగా, ముచ్చటగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: