రాజకీయాల్లో తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన పార్టీని నడిపించిన విధానం సిఎం గా రాష్ట్రాన్ని పాలించిన విధానం అన్నీ కూడా ఎందరినో ఆకట్టుకున్నాయి. సిఎం గా ఆయన సాధించిన విజయాలు గాని జయలలితను ఎదుర్కొన్న విధానం గాని అన్నీ కూడా ఒక సంచలనం అంటారు ఆయనను అభిమానించే వాళ్ళు. ఇక ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. 

 

ఇక అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ తమిళనాడు లో విపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడి గా ఆయన తనను తాను ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. రాజకీయంగా తండ్రికి అండగా ఉండటమే కాకుండా ఆయన ఇప్పుడు సొంతగా తన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పెద్దన్న నుంచి ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పార్టీలో సుప్రీం గా ఉన్నారు. 70 ఏళ్ళ వయసు దగ్గర పడుతున్నా సరే స్టాలిన్ లో మాత్రం ఏ విధమైన ఉత్సాహం కూడా తగ్గలేదు అనే చెప్పాలి. 

 

హుందా తనం అయినా మరొకటి అయినా సరే ఆయన తండ్రికి తగిన తనయుడుగా నిరూపించుకున్నారు అనే చెప్పాలి. ఇక రాజకీయంగా ఇప్పుడు డిఎం కే బలంగా ఉంది. యుపియే భాగస్వామ్యం తో ముందుకు వెళ్తుంది. దీనిలో స్టాలిన్ పాత్ర గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. ముందు నుంచి కూడా కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉన్నా సరే అక్కడ జాతీయ పార్టీలను వ్యతిరేకించినా సరే ఆయన మాత్రం చాలా ధైర్యంగా ప్రజల్లోకి కాంగ్రెస్ తో కలిసి ఉండాల్సిన అవసరం వివరించారు. ఇప్పుడు అక్కడ డిఎంకె కాంగ్రెస్ కలిసి నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: