నందమూరి హరికృష్ణ , షాలిని దంపతులకు జన్మించిన ఎన్టీఆర్.. తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు. అప్పట్లో హరికృష్ణ తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టిస్తే... అతడి వారసత్వమైన ఎన్టీఆర్  ఈ తరంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు అంటే అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్ 1,యమదొంగ వంటి సినిమాలను తీసి తెలుగు ఇండస్ట్రీలో అనేకమైన సినీ రికార్డు బద్దలు కొట్టిన క్రెడిట్ ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తన తండ్రి తెలుగు పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ... ఎన్టీఆర్ కేవలం తన నటనా చాతుర్యంతోనే అత్యంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. 

 

 

 

మాములుగా హరికృష్ణ తనయుడిగా ఎన్టీఆర్ సినీ రంగంలో అత్యుతన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎన్టీఆర్  ఎక్కువగా తన తండ్రితోనే సమయం గడిపేవాడు. తండ్రి, బాబాయి సినిమాలను చూస్తూ ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు ఎన్టీఆర్ అందుకే ఇప్పుడు తెలుగోళ్లు మెచ్చిన హీరోగా మంచి స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

 

 

ఏది ఏమైనా నందమూరి హీరోకి  హరికృష్ణకు తన కుమారుడు ఎన్టీఆర్  అంటే మిక్కిలి ఇష్టం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే తన తండ్రి  అంటే కూడా ఎన్టీఆర్ కు బాగా ఇష్టం. తనకి అవార్డులు వచ్చిన ప్రతిసారి తన తండ్రి గురించి చెప్పకుండా స్టేజి దిగడు ఎన్టీఆర్ . దీన్ని బట్టి తన తండ్రి అంటే తనకు ఎంత ఇష్టమో, గౌరవమో తెలుస్తుంది.ఇటీవల హరికృష్ణ స్వర్గస్థుడు అయ్యాడు. ఆ విషయాన్నీ ఇప్పటికి నందమూరి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సినిమాలలోకి వచ్చిన ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: