హిరో ధనుష్ రజినీకాంత్ అల్లుడు గానే కాకుండా సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా నటుడు ధనుష్‌ చిత్రాలను రజినీకాంత్‌ ఎందుకు నిరాకరించారు అన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. అయితే నటుడు ధనుష్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం అందరికి తెలిసిందే. ఈయన కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌లోను నటుడిగా పేరును సంపాదించుకున్నారు.

 

 

ధనుష్‌లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం విజయంతో ధనుష్‌ మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ తెనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ నటుడు నాగార్జున, శరత్‌కుమార్, నటి అధితి, ఎస్‌ ఏ. సూర్య వంటి పలువురు ప్రముఖ నటీనటులను ఏంపిక చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగిందని తెలిసిందే.

 


కాగా ఆ చిత్రంలో ముందుగా రజనీకాంత్‌ కథానాయకుడిగా చేయాలని ధనుష్‌ భావించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన రజనీకాంత్‌ కథకు కూడా కథ వినిపించారు. కథ విన్న రజినీకాంత్‌ చాలా బాగుంది అంటూనే ఇందులో ఫైట్స్‌ ఎక్కువగా ఉండడంతో తనకు బదులు యువ నటుడు నటిస్తే బాగుంటుంది అని చెప్పి అందులో.. తను నటించడానికి నిరాకరించినట్లు సమాచారం.

 

 

ఇక ఈ విషయం పక్కన పెడితే కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీ తెనాండాళ్‌ ఫిలిమ్స్‌ సంస్థ చిత్ర నిర్మాణాన్ని అప్పట్లో చేపట్ట లేకపోయింది. అయితే నటుడు ధనుష్‌ ఆ చిత్రాన్ని తాజాగా చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ముందుగా నటించడానికి అంగీకరించినట్లు చెప్పిన నాగార్జున ఇప్పుడు మళ్లీ నటిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది కాలం ఆగాల్సిందేన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: