అల్లు అరవింద్... సినిమాల మీద కాస్త అవగాహన ఉన్నా సరే ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు అనే సంగతి తెలిసిందే. తండ్రి అల్లు రామలింగయ్య నుంచి వారసత్వం అందుకున్న ఆయన నేడు సినిమాల్లో అగ్ర నిర్మాతగా ఉన్నారు. ఇక ఆయన కుమారుడు అల్లు అర్జున్ గురించి కూడా అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడి గా ఆయన నేడు సినీ పరిశ్రమలో తన ఇమేజ్ ని నిలబెట్టుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మెగా హీరోలు అందరూ కూడా చిరంజీవి ఇమేజ్ లో వచ్చారు అని అంటారు. 

 

కాని బన్నీ విషయంలో మాత్రం అలా ఉండదు ఏ మాత్రం కూడా. తండ్రి ని మించిన విజేత గా సినిమాల్లో బన్నీ నిలిచాడు. అయితే నిర్మాతగా పెద్దగా సినిమాలు ఆయన చేయలేదు గాని ఇప్పుడు మాత్రం ఆయన చాలా వరకు కూడా టాలీవుడ్ లో తన మార్క్ ని కచ్చితంగా చూపిస్తున్నారు అనేది వాస్తవం. ఇక  వరుసగా సినిమాలు చేయడం చేసే ప్రతీ సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం తో పాటుగా ఎవరి సలహాలు తీసుకోవాలో వారి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన. 

 

యువ హీరోల్లో ఇప్పుడు బన్నీ చాలా ముందు ఉన్నాడు అనే సంగతి తెలిసిందే. ఎవరికి అందని విజయాలను కూడా అతను తక్కు వ కాలంలో సాధించాడు అని చెప్పాలి. అగ్ర హీరో గా ఉన్నా సరే ఎక్కడ తగ్గాలో తెలిసిన హీరో బన్నీ అని అంటారు మెగా అభిమానులు కూడా. ఆ విధంగా ఆయన తన మార్క్ ని వేసారు. ఇక తండ్రికి ఫాన్స్ లేరు గాని బన్నీ కి మాత్రం ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పవచ్చు. మెగా హీరోల్లో చిరంజీవి పవన్ తర్వాత బన్నీనే అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: