తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నాటి తరం సినీ ప్రముఖుల వారసులు ప్రస్తుతం నేటి తరం జనాలను ఆకట్టుకుంటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సినీ ప్రముఖుల వారసులు ఎంతో మంది ఉన్నారు. ప్రముఖంగా అల్లు ఫ్యామిలీ నుంచి హీరో అల్లు అర్జున్.  మెగాస్టార్ కుటుంబం నుంచి పరిచయమై అల్లు ఫ్యామిలీ ఖ్యాతిని తెలుగు ప్రపంచానికి చాటి చెప్పాడు. అంతేకాదు స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

 

 


చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు బన్నీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని వరుస సినిమాలలో నటిస్తున్నాడు.ఓవైపు తండ్రి నిర్మాతగా ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తుంటే హీరోగా బన్నీ హిట్ సినిమాలలో నటిస్తూ డ్యాన్సర్ గా, స్టైలిష్ స్టార్ గా ఎందరో అభిమానుల హృదయాలను సంపాదించుకున్నాడు. 

 

 

 

 అయితే స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కు అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే  అల్లు అరవింది ప్రముఖ నిర్మాతగా , తనయుడు స్టార్ హీరోగా పేరును సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలోని జనాలను ఆకట్టుకుంటున్నారు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కూడా అందంతో ఎంతోమంది మగువల మనసును దోచాడు బన్నీ. ఒక రకంగా చెప్పాలంటే నేటి తరంలో తండ్రి ని మించి యూత్ ని ఆకర్షించాడు అనే చెప్పాలి. యూత్ లో బన్నీ కి మంచి పేరు ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురము లో సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: