జీవితంలో ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు తండ్రి చేయి పట్టుకునే నడక నేర్చుకుంటారు. విద్యా బుద్ధులు నేర్పించి, మంచి నడవడిక నేర్పడంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు. తల్లి గోరుముద్దలు పెడితే.. తండ్రి జీవితానికి దారి చూపిస్తాడు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తండ్రితో ఉన్న అనుబంధాల్ని గుర్తు చేసుకోవడం సహజమే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదలచుకోలేదు. అందుకే నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి-కొడుకుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో చిరంజీవి ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో తెలిసిన విషయమే. ఎన్నో విషయాలకు స్పందించే చిరంజీవి ఫాదర్స్ డే రోజున స్పందించకుండా ఉంటారా.. అదే చేశారు. తన ట్విట్టర్ అకౌంట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను ఎత్తకున్న తండ్రి వెంకట్రావు ఫొటోను పోస్ట్ చేసి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ‘Chirutha with my charming Dad. మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు.. రెండు నాకు చాలా ఇష్టం. #HappyFathersDay’ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
మెగా అభిమానులంతా ఈ పిక్ చూసి మురిసిపోతున్నారు. తమ అభిమాన హీరో తండ్రి, కుమారుడు గురించి ఓ రేర్ ఫొటోను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ పిక్ బాస్’, ‘రేర్ ఫొటో పోస్ట్ చేసి ఖుషీ చేశారు అన్నయ్య’, ‘చిరు”తండ్రి”తో.. చిరు”తనయుడు”’. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల పరంగా.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తూండగా.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు.
Chirutha with my charming Dad.మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం.#HappyFathersDay pic.twitter.com/qcYx1wVrJe
— chiranjeevi konidela (@KChiruTweets) June 21, 2020