సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ కాలం లో పూర్తిగా కొత్త అవతారంలోకి మారాడు. ఈరోజు ఫాదర్స్ డే సంధర్బంగా తన తండ్రికి విషెష్ తెలుపుతూ ఓ ఫోటో షేర్ చేశాడు. ఆఫోటోలో లాంగ్ హెయిర్ తో ఫ్రెంచ్ కట్  గడ్డంతో కనిపించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ ,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు. ఈసినిమా లో భాగంగానే  విజయ్ న్యూ లుక్ లోకి మారినట్లు వున్నాడు. 
ఇక ఫైటర్ విషయానికి వస్తే ఇప్పటివరకు 40శాతం షూటింగ్ జరుపుకోగా కరోనా వల్ల ప్రస్తుతం బ్రేక్ పడింది. ఆగస్టు లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తెలుగు తోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో విజయ్, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్  సిక్స్ ప్యాక్ లో కనిపించనుండగా రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తుంది. అపూర్వ మెహతా ,కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి , పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: