తెలుగు సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన హీరో చిరంజీవి. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్ధిగా సినీ కెరీర్ ను ప్రారంభించారు. కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసిన చిరంజీవి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలా సినిమాల్లో వచ్చిన తొలి అవకాశమే ‘IHG’ సినిమా. నరసింహరాజు హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలై నేటికి 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. అనంతరకాలంలో హీరోగా చిరంజీవి దిగ్విజయ యాత్రకు ఈ సినిమా బలమైన పునాది వేసింది. ఆయనకు, మెగాభిమానులకు ఈ సినిమా ప్రత్యేకమైంది.

IHG

 

నలుగురు కుర్రాళ్లలో ఒకరిగా చిరంజీవి నటించిన ఈ సినిమా 1979 జూన్21 న విడుదలైంది. రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. స్త్రీలపై జరిగే అన్యాయం, ప్రజలపై మోతుబరులు సాగించే దౌర్జన్యాలు.. వంటి సామాజిక అంశాలపై ఈ సినిమా తెరకెక్కింది. యువకులే దేశానికి భవిష్యత్తు అనే కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఊరిలో తండ్రి సాగించే దౌర్జన్యాలను స్నేహితుల సాయంతో అరికడతాడు హీరో నరసింహరాజు. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ లో ఒకరిగా చిరంజీవి నటించారు. సినిమాలో చిరంజీవి నటన, హావభావాలకు పేరొచ్చింది.

IHG' దర్శకుడు రాజ్‌ ...

 

రూమ్ లో ఫ్రెండ్స్ తో అల్లరి చేస్తూ చిరంజీవి చేసిన చిన్న డ్యాన్స్ మూమెంట్ భవిష్యత్తులో ఆయన సాధించే విజయానికి సంకేతంలా ఉంటుంది. చిరంజీవి కెరీర్లో మొదటి సినిమా ఇదే అయినా 1978లో ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది. ఫజులుల్లాహక్ నిర్మాతగా ధర్మ విజయ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. మహానటి సావిత్రి కూడా ఈ సినిమా నటించారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ ఇటీవలే మరణించారు. కెరీర్లో తొలి సినిమానే అభ్యుదయ భావాలున్న పాత్రలో చిరంజీవి నటించి విజయం సాధించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: