తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ ఈరోజు తన 46 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈసందర్బంగా విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ నుండి కొత్త పోస్టర్ ను విడుదలచేసి విజయ్ కి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. ఇక ఈపోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
ఫ్యాన్స్ ,సెలబ్రెటీలు ఈపోస్టర్ ను షేర్ చేస్తూ విజయ్ కి విషెస్ తెలియజేస్తున్నారు అయితే విజయ్ పుట్టిన రోజు నాడు మాస్టర్ ట్రైలర్ విడుదలకానుందని ప్రచారం జరిగింది కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు మరి ఈరోజు ట్రైలర్ కూడా విడుదలచేసి సప్రైజ్ ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికే ట్రైలర్ కట్ కూడా జరిగిపోయింది. 
యాక్షన్ ఎంటర్టైనర్ గా ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈచిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా కనిపించనుంది. అనిరుద్ సంగీతం అందించాడు. ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో నిర్మించిన ఈచిత్రం దీపావళికి విడుదలకానుంది. తెలుగులో ఈసినిమాను మహేష్ ఎస్ కోనేరు విడుదలచేయనున్నాడు. వరుస సక్సెస్ లతో విజయ్ ఫుల్ ఫామ్ లో ఉండడంతో మాస్టర్ పై తమిళ్ తోపాటు తెలుగు లోనూ భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: