ఇండియన్ సినిమాలో శ్రీదేవి గురించి ఎంత చెప్పినా సరే ఇంకొంచెం మిగిలే ఉంటుంది. అగ్ర హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలిగారు. ఇండియన్ సినిమాలో మొదటి లేడీ సూపర్ స్టార్ గా ఆమె తన మార్క్ ని వేసారు. ఎక్కడో పుట్టి ఇండియన్ సినిమాను శాసించే విధంగా ఆమె నిలబడ్డారు అనే చెప్పాలి. అగ్ర హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు ఆమె సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమెకు వచ్చిన పేరు గురించి కూడా ఎంత చెప్పినా సరే తక్కువే. ఎవరికి రాని విధంగా వచ్చింది ఆమెకు పేరు. 

 

ఇక అది పక్కన పెడితే ఆమె కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయంలో నిర్మాత బోణీ కపూర్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఆమె వివాహం చేసుకోవడం చాలా మందికి అప్పట్లో అసలు ఏ మాత్రం కూడా నచ్చలేదు అని అంటారు. ఆమె వివాహం చేసుకోవద్దు అని వేరే వారిని చేసుకోవాలి అని సూచించినా సరే ఆమె మాత్రం అతని తోనే ఇష్టపడి జీవితం చివరి వరకు కూడా ఆయన తోనే ఉన్నారు. ఇక ఆయనే ఆమెను ఏదో చేసారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమె మరణించినప్పుడు ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసారు. 

 

ఇక శ్రీదేవి మరణం నుంచి ఆయన ఇప్పటికి కూడా బయటకు రాలేదు అని చెప్తూ ఉంటారు. ఇక అది అలా ఉంటే ఆమె వివాహం చేసుకున్న తర్వాత దాదాపుగా సినిమాలకు దూరంగానే ఉన్నారు అని చెప్పాలి. ఆ తర్వాత తర్వాత ఆమె సినిమాలు చేసారు గాని ఎక్కువగా పెళ్లి అయిన తర్వాత యితే సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు . ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీ సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: