కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో యావత్ సినీ ప్రపంచానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. అందువల్ల చాలా సినిమాలు ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్, పెంగ్విన్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకా విడుదల కావాల్సిన చిత్రాల జాబితా మెల్ల మెల్లగా పెరుగుతోంది.

 

తాజాగా రానా సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్, వయాకామ్ 18 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన క్రిష్ణ అండ్ హిస్ లీల అనే చిత్రం డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. గుంటూర్ టాకీస చిత్రం ద్వారా ప్రేక్షకులకి సుపరిచితమైన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరించనుంది.

 

ఈ మేరకు రానా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రానా మాట్లాడుతూ, ఈ సినిమాపై పుకార్లు వచ్చిన విధంగానే మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశాడు. నిజమైన పుకార్ల ఆధారంగా తెరకెక్కినఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుందని అర్థం అవుతోంది. ప్రేక్షకులు ఊహించిన దానికంటే త్వరగా విడుదల కానుందట. థియేటర్లు మూతబడినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకి సినిమా రావడం అంటే ఒక్క ఓటీటీ ద్వారానే.

 

అందువల్ల ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల అవనుందని తెలుస్తుంది. అయితే ఓటీటీ ద్వారా ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని చిత్రాలకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. మరి రవికాంత్ తెరకెక్కించిన క్రిష్ణ అండ్ హిస్ లీల ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చిందంటే మరికొంత మంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: