రేణు దేశాయ్... చాలా మందికి ఈ పేరు పవన్ కళ్యాణ్ భార్య గా మాత్రమే పరిచయం ఉంది. ఇక ఆమె హీరోయిన్ గా చేసారు అనే విషయం చాలా మంది పవన్ ఫాన్స్ కి తెలియదు అనే చెప్పాలి. ఆమె హీరోయిన్ గా చేసి ఆమె పవన్ ని ప్రేమించారు అని పెళ్లి చేసుకున్నారు అని చాలా మంది ఆయన ఫాన్స్ కి ఇప్పటికి తెలియదు. ఇక ఆమె కెరీర్ పీక్ స్టేజి కి వెళ్ళే సమయంలో ఆమె పవన్ తో ప్రేమ లో పడి వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆమె వరుసగా సినిమా ఆఫర్లు వచ్చినా సరే పవన్ కి ఇష్టం లేదు అని సినిమాలు చేయలేదు అని చెప్తూ ఉంటారు. 

 

ఇక అది అలా ఉంటే ఆమెకు పిల్లలు కలిగిన తర్వాత పవన్ కి దూరం అయ్యారు. పవన్ కి ఎందుకు దూరం అయ్యారు అనేది ఎవరికి కూడా స్పష్టంగా తెలియదు అనే చెప్పాలి. ఇక ఆమె మళ్ళీ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని కామెంట్స్ కూడా వచ్చాయి మరి. మరి ఆమె చేసుకుంటారా లేదా అనేది తెలియదు. ఇక ఆమె నుంచి పెళ్లి ప్రకటన వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ మార్క్ చూపించి ఆమె మీద విమర్శలు నానా రకాలుగా చేసారు. ఇక ఆమె అక్కడి నుంచి కూడా తన వ్యవహారాలూ ఏదీ కూడా సోషల్ మీడియాలో చెప్పడం లేదు. 

 

ఏదైనా అత్యవసరం అనుకుంటే మినహా ఆమె పెద్దగా  ఏదీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో కూడా నటించే ఆలోచనలో లేరు దర్శకత్వం చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఎం చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: