తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ముఖ్యంగా అమ్మాయిలకు...అతగాడు పేరులో ఏవో వైబ్రేషన్స్ ఉన్నాయి.. అంటే అది నిజమే అంటున్నారు ఈనాటి అమ్మాయిలు .. అంతగా మహేష్ అందం వారికి నిద్ర లేకుండా చేసింది.అందుకే అమ్మాయిల కలల రాకుమారుడు గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇకపోతే మహేష్ బాబు సినిమాలు కూడా అలానే ఉన్నాయి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఎన్నో సినిమాలలో నటించి తండ్రికి మించిన తనయుడు అనే టాక్ ను అందుకున్నాడు.. 

 

 

మురారి సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ మొదటి సినిమాతోనే ఎనలేని ఫాలోయింగ్ ను అందుకున్నాడు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు  ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.. తర్వాత రాజకుమారుడు, యువరాజ్ , అతడు, అర్జున్, పోకిరి , లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.  అందుకే మహేష్ ఇప్పుడు టాప్ హీరోలలో ఒకడు గా నిలిచాడు.  

 

 

 

మరో విషయమేంటంటే.. మహేష్ కూడా కనిపించని రొమాంటిక్ కింగ్ అనే చెప్పాలి . అతను నటించిన నాని, బిజినెస్ మేన్ సినిమాలలో మహేష్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది.. దాంతో మరింత యూత్  ఫాలోయింగ్ పెరిగింది.  అదేంటంటే బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ చేసిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  కాజల్ తో చేసిన రొమాన్స్ సినిమా కు హైలెట్ గా నిలిచింది.  అందుకే ఈ సినిమా కథ పరంగా ఆకట్టుకోలేక పోయినా కూడా రోమాన్స్ ఉన్న సీన్ల ను మళ్లీ మళ్లీ చూడాలనిపించి సినిమాకు హిట్ నీ తీసుకొచ్చాయి...ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమా మహేష్ బాబు కు బ్లాక్ బాస్టర్ హిట్ ని అందించింది.. ప్రస్తుతం పరుశురాం, వంశీ పైడిపల్లి ల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: