వివాదాస్ప‌ద‌మైన విష‌యాల‌ను సినిమాలుగా మ‌లిచే ద‌ర్శ‌కులు బ‌హుశా భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా అరుదుగా ఉంటార‌నే చెప్పాలి. కానీ ఈ విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ ఎంతో ముందుంటారు. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా  ఆయ‌న తెర‌కెక్కినన్నీ సినిమాలు బ‌హుశ ఎవ‌రూ చేసి ఉండ‌రు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని అనేక నిజ సంఘ‌ట‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించ‌డం చేస్తూనే ఉన్నారు. వివాదాల‌ను వెంటాడుతూ వెళ్లే వ‌ర్మ‌.. అంతే స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు..ప్ర‌శంస‌లు..అందుకుంటూ వార్త‌ల్లో నానుతూనే ఉంటున్నారు. ఇది ఆయ‌న‌కు కొత్తేమీ కాదు.. అంద‌రికీ తెలిసిన క‌థే అది...కానీ తెర‌పై ఆర్జీవీ తీర్పు ఎలా ఇవ్వ‌బోతున్నారు...ఎవ‌రినీ విలన్‌గా మారుస్తారు...ఎవ‌రూ బాధితుల‌వుతారు..ఎవ‌రి వైపు న్యాయం ఉంది...ఎవ‌రు అన్యాయం అయ్యారు..అనే విష‌యాల‌ను చెప్పి...చెప్ప‌క‌నే తెర‌పై త‌న‌దైన శైలిలో తీర్పు ఇచ్చేస్తుంటారు.


 గ‌తంలో ఆయ‌న తెరకెక్కించిన చిత్రాల్లో హిట్లు ఉన్నాయి...ఫ‌ట్లు ఉన్నాయి. అయితే విజ‌యాలు..అప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోవ‌డం ఆర్‌జీవికే సాధ్యమ‌ని చెప్పాలి. ఆ కోవ‌లోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్‌-అమృత‌ల ప్ర‌ణ‌య గాధ...  ప్ర‌ణ‌య్ హ‌త్య‌...మారుతీరావు ఆత్మ‌హ‌త్య‌...ప‌రిణామాల‌ను సినిమాగా మ‌లుస్తున్న‌ట్లు చిత్ర బృందం ద్వార తెలుస్తోంది. జూన్ 21న ఫాద‌ర్స్ డేను పుర‌స్క‌రించుకుని మ‌ర్డ‌ర్ అనే టైటిల్‌తో ఈసినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఆర్జీవి త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. కొద్ది నిముషాల్లోనే ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. క‌రోనా వేళ టీవీ వార్త‌ల్లో ప్ర‌ధాన అంశంగా మారింది. స‌మ‌సిపోయింద‌నుకుంటున్న వేళ అమృత-ప్ర‌ణ‌య్‌-మారుతీరావుల విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. ఇదే విష‌య‌మై అమృత స్పందించింది. 


ఇప్పటికే నా జీవితం తలకిందులైంది.ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను.ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను.ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్‌ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు.నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎరికీ తెలియదు. గర్వంతో, పరువుపోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను.ఏదో అలా కాలం వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది.దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈనేప‌థ్యంలో ఆర్జీవీ సినిమా తెర‌కెక్కించ‌డంపై భిన్న వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. అమృత కోర్టుకు వెళ్లాల‌ని కొంత‌మంది సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: