బోల్డ్ టైప్ స్టోరీలకు థెయేటర్లలో చోటు ఉండదు, అక్కడ పక్కా మాస్ మసాలాకే ఆదరణ ఉంటుంది. యాక్షన్ మూవీస్, పగలు, ప్రతీకారాలు, రొడ్డ కొట్టుడు సీన్లు, భారీ డైలాగులు ఇవే థియేటర్లో సినిమాలకు ముడి సరకులు. భారతీయ సినిమా గురించి చెప్పుకుంటే అన్ని భాషల్లోనూ  మార్పులు వచ్చాయి. కంటెంట్ పరంగా కొంత ముందుంటున్నారు కానీ టాలీవుడ్ మాత్రం ఇంకా చింతకాయ పచ్చడి రోజుల్లోనే ఉంది.

IHG

దాన్ని మార్చేందుకు జాతకాన్ని తిరగరాసేందుకు అన్నట్లుగా ఇపుడు ఓటీటీ ఫ్లాట్ ఫారం వచ్చింది. ఓటీటీ ద్వారా మంచి కంటెంట్ కి చాన్స్ ఉంది. బోల్డ్ టైప్ కంటెంట్ తో సినిమా తీస్తే దానికి ఇక్కడ ఆదరణ బాగా ఉంటుంది. నిజానికి మానవ జీవితమే ఒక మహాభారతం అంటారు. ఎన్నో ఎమోషన్లతో మనిషి ఉంటాడు. ఒక్క రోజులో కోట్ల ఆలోచనలు చేసే మనిషి భావాలను అదిమి పట్టుకుని వాటిని కనుక స్క్రీన్ మీదకు తెస్తే అద్భుత కావ్యాలే అవుతాయి.

IHG

అయితే రిస్క్  ఇక్కడ ఉందని చాలా మంది ఆ జోలికి పోవడంలేదు. ఇపుడు మాత్రం ఓటీటీ ఒక వరంగా ఉందని టాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మంది అంటున్నారు. రవిబాబు లాంటి డైరెక్టర్లు అయితే మంచి కంటెంట్ తో సినిమా తీయాలి కానీ ఓటీటీ అద్భుతమైన ఫ్లాట్ ఫారం అవుతుంది అంటున్నారు. 

IHG

ఇక మనిషి జీవితం ఆడ మగ సంబంధాలు, వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు. సెక్స్ అన్నది ఎంతో ముఖ్యమైన పాత్ర మానవ జీవితంలో వహిస్తున్న సందర్భాలు ఇవన్నీ కూడా బోల్డ్ కంటెంట్ గా భావిస్తారు. కానీ వీటి నుంచి మంచి కధలు అల్లుకుంటే ఓటీటీ కూడా భారీ ఆదాయాన్ని తెచ్చే ఫ్లాట్ ఫారం అవుతుంది అంటున్నారు దర్శకులు. అలాగే మంచి ఆలోచనలు చాలా తెర మీదకు వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: