తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి అయిన రమాప్రభ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఐదు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో రమాప్రభ తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పాలి. అప్పట్లో రమాప్రభ రాజబాబు జోడి ఎంతో ఫేవరెట్గా నిలిచింది తెలుగు ప్రేక్షకులకు. అప్పట్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది రమాప్రభ. ఇక రాజబాబు తో కలిసి రమాప్రభ చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి . తన నటనతో తన అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రమాప్రభ. ఆనాటి నుంచి ఈనాటి వరకు తన ప్రస్థానాన్ని విజయవంతంగానే కొనసాగిస్తోంది. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికి  కూడా రమాప్రభ పలు కీలక పాత్రల్లో నటిస్తూ తన వైవిధ్యమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పిస్తే ఉంది. అయితే రమాప్రభ వైవాహిక జీవితం ఎంతో వివాదాస్పదం అనే చెప్పాలి. నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ తనకంటే వయసులో ఎంతో  చిన్నవాడైనా శరత్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన శరత్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే అప్పట్లో పెద్ద సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా పెళ్లి చేసుకోవడం పై అప్పట్లో రమాప్రభ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక ఆ తర్వాత వైవాహిక జీవితంలో కూడా ఎన్నో వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

 


 పెళ్లి తర్వాత శరత్ బాబు తో పదేళ్ల వరకు వైవాహిక జీవితాన్ని గడిపింది రమాప్రభ. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం కారణంగా విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత తన భర్త శరత్ బాబు పై సంచలన ఆరోపణలు చేసింది  రమాప్రభ. తనను  అవసరానికి వాడుకొని తన దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ కాచేశారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాను పెళ్లి విషయంలో మోసపోయాను అంటూ ఎన్నో వివాదాస్పద ఆరోపణలు చేసింది రమాప్రభ. అయితే రమాప్రభ శరత్ బాబు పై ఎన్ని  ఆరోపణలు చేసినప్పటికీ అటు శరత్ బాబు మాత్రం రమాప్రభ  గురించి చెడుగా మాట్లాడడం లేదు. ఇలా వీరిద్దరి పెళ్లి ఎంతో సంచలనంగా మారగా... వీరిద్దరూ విడిపోవడం కూడా టాలీవుడ్ లో పెద్ద సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: