స్టార్ హీరోకు అభిమానులే బలం. సినిమా రిలీజ్, వంద రోజులు, హీరో పుట్టినరోజు.. ఇలా సందర్భానుసారం అభిమానుల ఆనందాన్ని, చేసే సంబరాల్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ.. సోషల్ మీడియా వచ్చాక అసందర్భంగా చేస్తున్న కొన్ని పనులపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ టాలీవుడ్ స్టార్ మహేశ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్. మహేశ్ అభిమానులు అత్యత్సాహం ప్రదర్శించి #AdvanceHBDMaheshBabu అంటూ ట్విట్టర్ లో తెగ హడావిడి చేసేశారు. దాదాపు నెలన్నర తర్వాత చేయాల్సిన హడావిడి ఇప్పుడెందుకు చేసారో అర్ధం కానిది.

IHG

 

మహేశ్ పుట్టిన రోజు ఆగష్టు 9వ తేదీన. ఆ సందర్భంలో కామన్ డీపీలు, ట్విట్టర్ మెసేజెస్, హ్యాష్ ట్యాగ్స్ సహజమే. కానీ.. చేతిలో సెల్ ఫోన్ ఉంది.. సోషల్ మీడియా రెడీగా ఉంది.. మెసేజ్ టైప్ చేయడానికి చేతి వేళ్లు సిద్ధంగా ఉన్నాయి.. ఖర్చులేని పని అన్నట్టు ట్రెండ్ చేసేశారు. ఏకంగా 8.4 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. ఇప్పుడు మహేశ్ అభిమానులు ముందస్తుగా చేసిన ట్రెండ్ దేనికి సంకేతమో.. ఎందుకు చేస్తున్నారో.. ఎవరికి ఉపయోగమో అర్ధం కాదు. ఈ తాపత్రయమంతా మొన్న ఎన్టీఆర్ బర్త్ డే ట్వీట్స్ రికార్డ్ దాటాలనే అయ్యుంటుందని కామెంట్లు వస్తున్నాయి.

IHG

 

ఈ తరహా ట్రెండ్స్ ఏ హీరో అభిమానులకైనా తగనిది. వీటి వల్ల అభిమానుల మధ్య పోటీతత్వం ఒకరిపై మరొకరు దూషించుకోవడం మినహా జరిగేదేమీ ఉండదు. రీసెంట్ గా మహేశ్ ఫ్యాన్స్, తమిళ విజయ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా గొడవపడడం.. తిట్టుకోవడం జరిగింది. ఒక హీరోకి వచ్చిన ట్వీట్స్ దాటాలని మరో హీరో అభిమానులు.. ఆ రికార్డులు దాటాలని మరో హీరో అభిమానులు.. ఇలా ఒకరిపై మరొకరు ధ్వేషిస్తూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేసి రాష్ట్రాలు దాటేస్తున్నారు. ఇటువంటి హడావిడికి అభిమానులే అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: