బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క శర్మ. ఆమె సినిమాలు అటు హీరోయిన్ గా ఇటు నిర్మాతగా కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక భర్త విరాట్ కోహ్లే సహకారం తో ఆమె చాలా వరకు దూకుడు గా సినిమాలను చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు లో కూడా సినిమాలను నిర్మించే ఆలోచనలో ఆమె ఉంది అని సమాచారం. అవును తెలుగులో ఒక రెండు సినిమాలను ఆమె నిర్మించే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. 



ఒక యువ హీరో తో సినిమా చేయడానికి గానూ ఆమె ప్లాన్ చేస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా విషయంలో ఆమె ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది అని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది అనేది చెప్పడం కాస్త కష్టమే. ఇక ఈ సినిమాను ఒక మెగా హీరో తో చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. ఇక ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమాను చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. 

 

మరి ఆ విధంగా అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరో గా ఆమె ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో ఏ సినిమా చేస్తుందో... ఇప్పుడు ఆమె రెండు సినిమాల్లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: