ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఏమో గాని టాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా గురించి జరిగే చర్చలు అన్నీ ఇన్ని కావు. ఏదోక వార్త టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా గురించి వస్తూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దాని కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పుడు తారక్ పాత్ర విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి. తారక్ ఏ పాత్రలో నటిస్తాడు అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి టాలీవుడ్ లో. ఇక తాజాగా అతని సినిమా గురించి వచ్చిన వార్త ఒకసారి చూస్తే... 

 

ఈ సినిమాలో తారక్ పాత్ర ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని అతను ఈ సినిమాలో మరోసారి లావు గా కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ పాత్ర గురించే చర్చలు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ పాత్రలో తారక్ ప్రయోగం చేస్తున్నాడు అని రెండో భాగం మొత్తం కూడా అతను గుండు తో కనపడే అవకాశం ఉంది అని చర్చలు జరుగుతున్నాయి. గుండు తో పాటుగా మీసం తో కూడా అతను కనపడే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది. మరి నిజమా కాదా అనేది తెలియదు. 

 

అతను ఈ సినిమాలో గ్రామ సర్పంచ్ గా కనపడే అవకాశం ఉందని, విదేశాల్లో చదివి వచ్చిన యువకుడు పరిస్థితుల ప్రభావం తో గ్రామానికి సర్పంచ్ ఏ విధంగా అయ్యాడు అనే దానిని తన మార్క్ తో చూపించాలి అని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి  ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: