ఎవరు ఎన్ని చెప్పినా సరే రాబోయే రెండేళ్ళు మాత్రం సినిమాకు చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు అందరూ అదే విషయంలో ఎక్కువగా భయపడుతున్నారు అనేది అర్ధమవుతుంది. యువ హీరోలకు చాలా వరకు ఈ భయం ఉంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా ఉన్న స్టార్ హీరో బన్నీ కూడా ఇప్పుడు రెండేళ్లకు సరిపడా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. అవును అతను రెండేళ్లకు సరిపడా సినిమాలను లైన్ లో పెడుతున్నాడట. 

 

ఇప్పుడు సుకుమార్ తో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది. ఇక 2021,22, 23 ని కూడా అతను లైన్ లో పెడుతున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కథలను ఇప్పుడే వింటున్నాడు అని సమాచారం. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని భవిష్యత్తు విషయంలో ముందే జాగ్రత్త పడటం మంచిది అనే భావన లో అతను ఉన్నాడు అని అంటున్నారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కోసం మాత్రం అతను దాదాపు రెండేళ్ళ పాటు కేటాయించే సూచనలు ఉన్నాయి. 

 

ఈ సినిమాలో అతను చేస్తున్న పాత్ర కాస్త కష్టమే. అందుకే అతను ఇప్పుడు చాలా వరకు  జాగ్రత్తలు పడుతూ సినిమాలను చేస్తున్నాడు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో కాస్త బరువు కూడా పెరిగే ప్రయత్నం చేస్తున్నాడు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. ఇక అతను ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా తానే నిర్మాతగా ఉండాలి అని భావిస్తున్నాడని టాలీవుడ్ లో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: