ఇటివల భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో భారత్ 20మంది వీర జవాన్లను కోల్పోయింది. ఇదంతా చైనా దురాక్రమణ, వక్రబుద్ధి వల్లే అని ఇండియా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ లో ‘బ్యాన్ చైనా ప్రొడక్ట్స్’ పేరుతో ఓ మినీ ఉద్యమమే నడుస్తోంది. చాలా మంది చైనా ప్రొడక్టులు తగులబెడుతున్నారు. రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్2 సీజన్ విన్నర్ కౌశల్ మందా కూడా చైనాపై, వారి ప్రొడక్ట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

IHG

 

‘ఇది చైనా ప్రొడక్ట్ ఒప్పో ఫోన్. దీనిని నాకు బిగ్ బాస్ సమయంలో ఇచ్చారు. నేను చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను ఉపయోగిస్తున్న చైనా కంపెనీ ఒప్పో ఫోన్..’ అంటూ కోపంతో నేలకేసి కొట్టేశాడు. దీంతో ఆ ఫోన్ పగిలిపోయింది. దానిని తీసుకొచ్చి డస్ట్ బిన్ లో వేసేశాడు. ‘చైనా దేశంపై నా కోపాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాను. నేను చేసినట్టే మీరు కూడా చేయాలనేది నా ఉద్దేశం కాదు. నా దేశం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం.. జైహింద్’ అంటూ తన ఇన్ స్టా వాల్ లో రాసుకున్నాడు.

IHG's ...

 

కౌశల్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ‘అందరూ మీలా మరొక ఫోన్ కొనుక్కోలేరు’, ‘ఉపయోగించే ఫోన్ పగలకొట్టే బదులు కొత్తవి కొనకుండా ఉండాలి’, ‘ఉన్నవి పగులకొట్టేస్తే మనకే నష్టం’, ‘గిఫ్ట్ గా వచ్చింది పగలకొట్టడం ఏంటి’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కౌశల్ ను సపోర్ట్ చేస్తూ.. ‘మంచి పని చేశావ్ అన్నా’, ‘జై హింద్’, ‘నువ్వు మాకు ఇన్ స్పిరేషన్’.. అని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I show my frustration on china like this, This doesn't mean you have to do same like me or break anything..N I do Anything for our Country.Jaihind🇮🇳 #WeStandWithIndianArmy #chinawar #letsbeunited #indianarmy #narendramodi #boycottchinaproducts #iloveindia #iloveindianarmy

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: