రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మరి కొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆతృత గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం పలానా డేట్ కు రానుందని వార్తలు వస్తున్నే వున్నాయి అయితే ఆ డేట్ లు వెళ్లిపోతున్నాయి తప్ప ఫస్ట్ లుక్ కాదు కదా దానికి సంబంధించిన అప్డేట్  కూడా  రావడం లేదు. ఇక కొన్ని రోజుల క్రితం ఈరోజు ఫస్ట్ లుక్ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. ఫ్యాన్స్ ఒత్తిడికి తలొగ్గి  ఫస్ట్ లుక్ ను రెడీ చేసి పెట్టారు మేకర్స్ అయితే అది విడుదలచేయడానికి మాత్రం వారికి సరైన డేట్ దొరకడం లేదు.
 
ఫిలిం నగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం షూటింగ్ స్టార్ట్ అయ్యేంతవరకు ఫస్ట్ లుక్ ను విడుదలచేయకూడదని డిసైడ్ అయ్యారట నిర్మాతలు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈసెట్ పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ఆతరువాత కానీ షూటింగ్ ను మొదలుపెట్టరు. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యే రోజే ఫస్ట్ లుక్ ను విడుదలచేయాలని భావిస్తున్నారట. సో జులై మొదటి వారంలో లేదా రెండో వారంలో ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ వుంది.
 
ఈసినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు  సమాచారం. ఫస్ట్ లుక్ విడుదలచేసిన రోజునే  టైటిల్ ను కూడా విడుదలచేయనున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్  చేస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: