హైపర్ ఆది చేసే జబర్దస్త్ స్కిట్స్ లలో కామెడీ కంటే ఎక్కువగా ఒకరి అందాన్ని, శరీర రంగుని కించపరచడమే ఉంటుంది. ఒకరి శరీరాకృతిని, లోపాలను ఎత్తిచూపుతూ హాస్యం పండించే ఆది అంటే అందరికీ చిరాకే. హిజ్రాలపై కూడా ఒక స్కిట్ చేసి వాళ్ళ చేత చీ కొట్టించుకున్నాడు హైపర్ ఆది. తన పంచులకు ఎంత పాపులారిటీ వచ్చిందో అదే రీతిలో తన కించపరిచే డైలాగులకు విమర్శలు వచ్చాయి. ఒకళ్ళను బాధపెట్టే లా ఉండే స్కిట్లను హైపర్ ఆది చేస్తాడు కానీ వారి కోసం ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పడానికి ఆసక్తి చూపడు.


ఇతనికి మెగాఫ్యామిలీ అంటే అత్యంత ప్రీతి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా ఫేవరేట్ హీరో అని హైపర్ ఆది ఎప్పుడూ చెబుతుంటాడు. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాటలకు డాన్సులు వేస్తూ నాగబాబు దగ్గర మార్కులు కొట్టేసేవాడు ఆది. నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోయినప్పటికీ ఆది మాత్రం జబర్దస్త్ షో లో మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాడు. ఏదేమైనా ఆది మెగా ఫ్యామిలీ కి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. చిత్ర షూటింగుల ప్రారంభ విషయమై తనని సమావేశానికి పిలవలేదని అలిగిన బాలకృష్ణ చిరంజీవి పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడన్న సంగతి తెలిసిందే. అనంతరం నాగబాబు అతడిపై విరుచుకుపడ్డాడు అన్న సంగతి కూడా విధితమే. అయితే నాగబాబుకి ఇప్పటికీ బాలకృష్ణ పై కోపం తగ్గలేదని తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో హైపర్ ఆది చెప్పే డైలాగులు వింటుంటే అర్థమవుతుంది. 


తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో హైపర్ ఆదినే మొట్టమొదటి గా కనిపిస్తాడు. ఆ తర్వాత... 'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డీకపూల్’ అని రైజింగ్ రాజుని ఉద్దేశించి హైపర్ ఆది అంటాడు. అయితే బాలకృష్ణ లేటెస్ట్ సినిమా ట్రైలర్ లో చెప్పిన ‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’ అనే పవర్ ఫుల్ డైలాగుని హైపర్ ఆది ఇమిటేట్ చేశాడని చెప్పుకోవచ్చు.

 

సాధారణంగా బాలకృష్ణని ఎవరైనా ఇమిటేట్ చేస్తే తన అభిమానులు విపరీతంగా కోప్పడతారు. ఇంతకుముందు షకలక శంకర్ వంటి జబర్దస్త్ హాస్యనటులు బాలకృష్ణ ని ఇమిటేట్ చేసి చిక్కుల్లో పడ్డారు. అప్పటినుండి ఏ జబర్దస్త్ హాస్యనటుడు బాలకృష్ణ ఇమిటేట్ చేయలేదు. కానీ తాజాగా హైపర్ ఆది బాలకృష్ణ ని ఇమిటేట్ చేసి అతడి అభిమానులను బాగా రెచ్చగొడుతున్నాడు. అయితే హైపర్ ఆది ఈ డైలాగు చెప్పడానికి నాగబాబు కారణమని తెలుస్తుంది. బాలకృష్ణ అని తెలుసుకోవడానికి నాగబాబు కావాలని హైపర్ ఆది చేత ఇలా డైలాగులు జిమ్మిక్కులు చేస్తున్నారని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏదేమైనా హైపర్ ఆది స్కిట్ టీవీలో ప్రసారం కాకూడదని బాలకృష్ణ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: