మెగాస్టార్ చిరంజీవి వెండితెర వెన్నెల తరంగం. ఒకపుడు చిరంజీవి సినిమాలు వస్తే ధియేటర్లకు ప్రతీ రోజూ సంక్రాంతి పండుగే వచ్చేది. చిరంజీవికి ఉన్న మాసిజం ఆ రేంజిలో పండేది. ఇక చిరంజీవి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా సెకెండ్ థర్డ్ రిలీజ్ లో డబ్బులు తెచ్చేసేవి. మొత్తానికి నిర్మాతల పాలిట కొంగుబంగారంలా చిరంజీవి ఉండేవారు.

IHG's new line of perfumes aims to empower the ...

ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. ఆయన అందరితోనూ జంట బాగానే కుదిరేవారు. చిరంజీవి విజయశాంతి, రాధ వంటి గ్లామరస్ హీరోయిన్లతో స్టెప్స్ వేస్తున్న సమయంలోనే సుహాసినితోనూ మెలోడీలు పాడుతూ క్లాస్ ఆడియన్స్ ని రంజింపచేసేవారు.

IHG

వీరిద్దరూ నటించిన సాంగ్ మరణ మ్రుదంగం సినిమాలోని మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సూపర్ డూపర్ మెలోడీ. అది ఎప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఇక కిరాతకుడు మూవీలోని సాంగ్స్ అన్నీ హిట్. మంచిదొంగ సినిమాలో ఓ వైపు విజయశాంతి గ్లామర్ ఒలికిస్తే మరో వైపు సుహాసిని కూడా తనదైన నటనతో మెగా జట్టు కట్టింది.

IHG

ఇవన్నీ ఎందుకంటే ఈ జంట మళ్ళీ కనువిందు చేయబోతున్నారుట. అయితే హీరోహీరోయిన్లుగా మాత్రం కాదు, చిరంజీవికి వరసకు సోదరిగా ఉండే పాత్రలో సుహాసిని నటిస్తోందని టాక్ వస్తోంది. లూసీఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరు  మోహన్ లాల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

IHGలో మంజూవారియర్ పాత్రలో సుహాసినిని సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తూండగా సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి సుహాసిని చిరంజీవి అన్నా చెల్లెళ్ళు అంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: