లెక్కల మాస్టారు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. అందుకే బాలీవుడ్ ఎంట్రీకి సుకుమార్, బన్నీ గట్టి ప్లాన్స్ వేసుకుంటున్నారట. తమిళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బన్నీ కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సౌత్ మొత్తంలోనే అతి మెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ రేంజ్ క్రేజ్ దక్కించుకోవాలని పుష్ప సినిమాతో సన్నాహాలు చేస్తున్నాడు.

 

మొదటి సినిమా ఆర్య నుండి సుకుమార్ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులే సుకుమార్ మేకింగ్ స్టైల్ కి ఫిదా అయ్యారు. అంతేకాదు కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ కి సుకుమార్ స్టైల్ మేకింగ్ ని ఫాలో అవుతున్నారు. ఇక పర్ఫార్మెన్స్ లో బన్నీ స్టామినా గురించి తెలిసిందే. అందుకే బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా పుష్ప కోసం సుకుమార్ స్క్రిప్ట్ లో చిన్న మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక బన్నీ కూడా తన యాక్టింగ్, డాన్స్ తో మెస్మరైజ్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాలో బన్నీ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది దృష్ఠిలో పెట్టుకొనే సుకుమార్  దేవీశ్రీప్రసాద్ తో సాంగ్స్ కంపోజ్ చేపిస్తున్నాడట. 

 

ఇప్పటికే బన్నీ డాన్స్ ఎలా ఉంటుందో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మేకర్స్ కి బాగా తెలుసు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ కూడా బన్నీ డాన్స్ కి ఫిదా అవుతుంటారు. అలాగే ఫాలో అవుతుంటారు కూడా. ముఖ్యంగా వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ లో బన్నీ మూవ్ మెంట్స్ గమనించవచ్చు. ఇక హీరోయిన్స్ అయితే ఎపుడు ఛాన్స్ వస్తుందా తనతో కలిసి స్టెప్పులేద్దమా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిని తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: