బాహుబలి వంటి హిస్టరీ రికార్డ్ చేసిన తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టిస్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ కాన్వాయిస్ తో రెడీ అవుతున్న ఈ సినిమాని బాహుబలి మించి సక్సస్ సాధించేలా రాజమౌళి తీర్చి దిద్దుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలవబోతుందట. అయితే ప్రస్తుతం కొన్ని క్లిష్ఠ  పరిస్థితులు నెలకొన్నప్పటికి వాటిని అధిగమించి త్వరలోనే సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నారు. ఇక ఈ సినిమాని 2021 సమ్మర్ కి ఎలా అయినా రిలీజ్ చేయాలని ప్లాన్స్ వేస్తున్నారట. 

 

IHG

ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య రూపొందుతుంది. ఈ సినిమాలో రాం చరణ్ కూడా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవదాయ దర్మదాయ శాఖలో జరుగుతున్న అవినీతి ని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. అయితే 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కూడా సమ్మర్ కే రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి ముందు గాని లేదా తర్వాత గాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

 

 

IHG's 'Acharya' First Look Date Announced, To be Released ...

అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా టార్గెట్ గా వస్తోంది. సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ సారి భారీ సక్సస్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నాడు. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక కే.జి.ఎఫ్ ఛాప్టర్ 2 కూడా పాన్ ఇండియా సినిమాగానే నిర్మిచారు. ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన కే.జి.ఎఫ్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు 2021 లో రిలీజ్ చేయాలనుకుంటున్నప్పటికి రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేకపోతున్నారు.

 

IHG

 

ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి సుజీత్ కాంబినేషన్ లో నిర్మించబోయో లూసీఫర్ రీమేక్ ని కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు. ఇక పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ సినిమా కూడా నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. దీంతో పాటు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పుష్ప సినిమా 5 భాషల్లో భారీ సినిమాగా పాన్ ఇండియా టార్గెట్ గా రెడీ చేస్తున్నారు.

 

IHG

ఇవే కాదు పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం, కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న భారతీయుడు 2 కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో ఎప్పుడైనా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండే ఒక్క పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ సినిమా తప్ప మిగతావన్ని 2021 ఆఖరు వరకు ఏది ఎప్పుడు వస్తుందో పక్కా క్లారిటి లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: