విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ డైరెక్షన్ లో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి సరైన సినిమా అని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులను విజయ్ దేవరకొండ ప్రకటించాడు. శివ నిర్వాణతో ఓ సినిమా అలాగే దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దిల్ రాజు నిర్మాణంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ ప్రధాన తారాగణంగా వి సినిమాని కంప్లీట్ చేసి ఉన్నాడు. తర్వాత దిల్ రాజు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలోనే విజయ్ దేవరకొండ సినిమాని నిర్మించబోతున్నాడని అని తాజాగా వార్తలు వస్తున్నాయి. 

 

రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే విజయ్ దేవరకొండ - ఇంద్రగంటి మోహన్ కృష్ణ - దిల్ రాజు నిర్మాణంలో రూపొందే సినిమా నాని "వి" సక్సస్ మీదే ఆధారపడి ఉందని ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి. మరి నాని వి ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో చూడాలి.

 

ఇప్పటికే దిల్ రాజు జాను తో భాగా నష్టపోయి ఉన్నాడు. దానికి తోడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నాని వి అలాగే ఉన్నాయి. ఎప్పుడు రిలీజవుతాయో కూడా పక్కాగా క్లారిటీ లేదు. ఈ సినిమాల రిజల్ట్ గనక తేడా కొడితే దిల్ రాజు కష్టాలు చెప్పతరం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: