టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ రాజమౌళి గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకనగా ఇటీవల ఆయన తీసిన బాహుబలి రెండు భాగాలు తెలుగు సినిమా పేరుని విశ్వవ్యాప్తం చేసి, రీజినల్ సినిమాలు కూడా ప్రపంచస్థాయిని అందుకోగలవు అంటూ నిరూపించాయి. ఆ సినిమాలతో రాజమౌళికి మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా విపరీతమైన పేరు రావడం జరిగింది. ఇకపోతే ఆయన తీసిన బాహుబలి రెండు భాగాల్లో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు, పాత్రల మధ్య భావోద్వేగాలు, ముఖ్య భూమిక పోషిస్తాయి అని చెప్పకతప్పదు. 

IHG

మరీ ముఖ్యంగా ఆ సినిమాలను కొంత నిశితంగా పరిశీలిస్తే రాజ్యాధికారం కోసం అన్ననే తప్పుడు ఆలోచనలు చేసి తుదిముట్టించిన భల్లాల దేవుడి క్రూరత్వం, అలానే రాజ్యాధికారం చేపట్టిన అనంతరం రాజ్యానికి ప్రభువుగా కాకుండా ఒక నియంతగా ప్రజలను తన ఇష్టం వచ్చినట్లు పాలిస్తూ, వారిని పలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు. అయితే ఆ పాత్రకు పూర్తి భిన్నంగా అన్న మహేంద్ర బాహుబలి, మొదటి నుండి తల్లి అడుగుజాడల్లో నడుస్తూ న్యాయం, ధర్మం, సత్యం వంటివి పాటిస్తూ ముందుకు సాగుతుంటాడు. అనంతరం తల్లి యొక్క ఆజ్ఞానుసారం ఒకానొకసాయంలో రాజ్యాధికారం చేపట్టిన అమరేంద్ర బాహుబలి, మొదటి నుండి ప్రజల పక్షాన నిలుస్తూ వారి అమితమైన ప్రేమానురాగాలు అందుకుంటాడు. అయితే అన్న రాజు కావడం భరించలేని తమ్ముడు భల్లాల దేవుడు, తన తండ్రి సహా మరికొందరితో రాజకీయ కుట్రలు చేసి కుతంత్రంతో అతడిని కట్టప్పతో ఘోరంగా చంపిస్తాడు. 

 

వాస్తవానికి కల్పిత గాథగా పీరియాడికల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బహుబాలి సినిమాని బట్టి చూస్తే అప్పట్లోనే రాజ్యాధికారం కోసం ఏ విధంగా కుట్రలు జరిగేవో కొంత అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లోనే డబ్బు, అధికారం కోసం ఈ విధంగా తప్పుడు ఆలోచనలు చేసేవారు ఉన్నారంటే, పదవి కాంక్ష అనేది మనిషి మనసులో ఏ విధంగా నాటుకుపోయిందో అర్ధం అవుతుంది. ఇక ఇప్పటి రాజకీయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఎంతో గొప్ప రీతిలో తెరకెక్కి, అద్భుత విజయం సాధించిన బాహుబలి సినిమా ద్వారా మనకు రాజకీయ కుట్రలు, కుయుక్తులను గురించి పరోక్షంగా చూపడం జరిగింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: