ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో జనతా గ్యారేజ్ ఒకటి. ఈ సినిమా అతని కెరీర్ లో తొలి కమర్షియల్ సినిమా గా కూడా నిలిచింది అనే చెప్పాలి. ఈ సినిమాలో తారక్ నటన నుంచి  ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో మంచి పట్టు ఉండటమే కాకుండా దానిని దర్శకుడు ప్రేక్షకులకు అందించిన విధాన౦ కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ స్థాయికి తగిన విధంగా నటించి సినిమాకు తమ రేంజ్ లో కొత్త అందం తీసుకొచ్చే ప్రయత్నం చేసారు అనేది వాస్తవం. 

 

ఇక ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే రాజకీయ కోణం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజయ్ కుమార్ సిఎం గా నటిస్తారు ఈ సినిమాలో. ఎక్కువ సేపు రాజకీయ కోణం చూపించలేదు గాని చూపించిన కాసేపు అయినా సరే ప్రతీ ఒక్కటి  చాలా అందంగా చూపించారు. ఇక ఆల్ పార్టీ మీటింగ్ గాని ప్రతీ ఒక్కటి కూడా ఈ సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అవార్డ్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ కు డిమాండ్ కూడా బాగా పెరిగింది. 

 

ఆయనకు కమర్షియల్ దర్శకుడు అనే ముద్ర వేసారు ఇక్కడి నుంచి అనే చెప్పాలి. ఈ సినిమా ఆయన కెరీర్ లో కూడా మంచి హిట్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: