ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి అరవింద సమేత. రాజకీయ కోణం లో వచ్చిన ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్యాక్షన్ తో పాటుగా రాజకీయం కూడా అదే విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక దర్శకుడి టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపిస్తాడు. ఫ్యాక్షన్ సీన్ తో సినిమా మొదలు కాగా ఇక అక్కడి నుంచి ఉండే రాజకీయ కోణాలు అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. ఎమ్మెల్యే పదవికి జరిగే పోటీ నుంచి ప్రతీ ఒక్కటి కూడా సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. 

 

అంతే కాదు సినిమాలో రాజకీయ నాయకుడి గా కూడా తారక్ కనిపించే ప్రయత్నం చేస్తాడు. ఆయన రాజకీయం గురించి ఎక్కువగా ఆలోచించకపోయినా సరే ఎమ్మెల్యే సీటు ని ఏకగ్రీవం చేయడానికి గానూ అందరిని ఒప్పించిన విధానం సంధి కోసం పార్టీ పెద్దలను కూర్చోబెట్టిన విధానం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత తారక్  రాజకీయ నాయకుడి గా నటిస్తే బాగుంటుంది చూడటానికి అని చాలా మంది అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనే దాని మీద కూడా ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ తో ఒక సినిమాను  ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. త్రివిక్రమ్ తో మళ్ళీ తారక్ తో సినిమా చేస్తున్నాడు అని అది కూడా రాజకీయ కోణం లోనే ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా టైటిల్ మీద కూడా ఎన్నో ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: