బాలకృష్ణ కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాలో బాలయ్య నటన నుంచి ప్రతీ ఒక్కటి ఆకట్టుకున్నా సరే ఒక వర్గం మాత్రమే ఈ సినిమాను చూడటం తో ఈ సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని కోణాలు ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చాయి గాని సినిమా మాత్రం ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి భాగం లో ఎన్టీఆర్ జీవితంలో సినిమాను ఎక్కువగా చూపించారు. ఇక రెండో భాగం విషయానికి వచ్చి చూస్తే ఎన్టీఆర్ ని ఎక్కువగా రాజకీయ నాయకుడి గానే చూపించారు. 

 

కాని ఆ చూపించే విధానం సరిగా లేకపోవడం తో సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాను ఎక్కువగా ఒక సామాజిక వర్గం మాత్రమే ప్రమోట్ చేయడం కూడా సినిమాకు బాగా మైనస్ అయింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఉన్న రాజకీయ కోణం విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఆ తర్వాత ఆయన నిలబడిన విధానం సిఎం అయిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్  పాత్రలో బాలయ్య మినహా ఎవరు చేసినా సరే సినిమాకు ఆ రేంజ్ రాదు అని చాలా మంది కామెంట్ కూడా చేసారు అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో  బాలకృష్ణ కాస్త జాగ్రత్తలు తీసుకుని సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిగా అందించి ఉంటే మరో రేంజ్ లో సినిమా హిట్ అయి ఉండేది అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: