బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో అంచనాలతో బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన చిత్రం సింహ. ఈ సినిమాలో బాలయ్య నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య నటన ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ప్రజలకు సేవ చేసే వైద్యుడి గా ఆయన ఈ సినిమాలో  కనపడతారు. అదే ఈ సినిమాకు హైలెట్ అయ్యే కోణం కూడా. అదే విధంగా ఈ సినిమాలో ఆయనను చూపించిన కోణం తో పాటుగా విలన్ గా నటించిన కోటా శ్రీనివాసరావు ని చూపించిన కోణం కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. 

 

ఆయన ఈ సినిమాలో రాజకీయ నాయకుడు. ఇక సినిమాలో ఆయన పాత్రే హైలెట్ గా ఉంటుంది. విలన్ గా రౌడీ యుజం చేస్తున్నా సరే ఆయన రాజకీయ నాయకుడి గా కనిపిస్తారు గాని రాజకీయ కోణం అనేది ఎక్కువగా ఉండదు సినిమాలో. ఇక  ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడం తో బాలయ్య కూడా ఈ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

సినిమా తర్వాత ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఉంది అనే  ప్రచారం జరుగుతుంది. మరి ఏ ప్రాజెక్ట్ చేస్తారు అనేది ఇంకా స్పష్టంగా తెలియదు గాని ఆయన మాత్రం భారీ బడ్జెట్ సినిమాలో తారక్ తో కలిసి చేసే అవకాశం ఉంది అని టాక్ వినపడుతుంది. ఈ సినిమాలో బాలయ్య కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అని సమాచారం... చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: