వరుస ఫ్లాప్ ల తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ నటన సినిమా కథ అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమాలో అతని నటన నుంచి ప్రతీ ఒక్క కోణం కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు. ఇక అది పక్కన పెడితే ఈ సినిమాలో ఉండే రాజకీయ కోణం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విలన్ గా నటించిన వ్యక్తి రాజకీయ నాయకుడు అవ్వాలి అని భావిస్తాడు. ఇక అతను ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 

 

అప్పటికే యూత్ నాయకుడి గా ఉంటాడు అతను. ఇక అక్కడి నుంచి రాజకీయ నాయకుడి గా కావాలి అనే కోరిక తో కాస్త ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అధిష్టానం నుంచి సీటు కోసమని అతను చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఆకట్టుకుంటాయి. ఇక అధిష్టానం సీటు ఇవ్వలేదు అని పార్టీ అగ్ర నేతను అతను చంపాలి అని భావించడం సినిమా అక్కడి నుంచి మరో రేంజ్ కి వెళ్తుంది. ఇక విలన్ గా అతను చూపించిన కోణాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. 

 

ఆయనకు అక్కడి నుంచి మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలో పోలీసులను అవమానించారు అనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. కాని అలా కాదు అని దర్శకుడు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: