మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తన రెండవ రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మళయాల చిత్రమైన లూసిఫర్ హక్కుల్ని కొనుక్కున్న చిరంజీవి, ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకి తగినట్లుగా తీర్చిదిద్దడానికి సాహో దర్శకుడు సుజిత్ కి అప్పగించాడు. ప్రస్తుతం సుజిత్ లూసిఫర్ స్క్రిప్టు పనులు పూర్తి చేసాడని టాక్. అయితే ఈ చిత్రానికి సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుకుతున్నారట.

IHG

బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్- అతుల్ చిరంజీవి తెలుగు లూసిఫర్ చిత్రానికి సంగీతం అందిచబోతున్నట్లు టాక్ వినబడుతుంది. డైరెక్టర్ సుజిత్ ఈ మేరకు వారిని సంప్రదించాడని అంటున్నారు. అయితే ఇదే నిజమైతే అజయ్- అతుల్ మంచి అవకాశం దక్కించుకున్నట్లే అని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ ఆచార్య సినిమాకి సంగీతం అందించడానికి మొదట వినిపించిన పేర్లు ఈ బాలీవుడ్ ద్వయానిదే.

IHG

ఈ మేరకు కొరటాల శివ ఆసక్తి కనబర్చాడు కూడా. కానీ ఏవేవో కారణాల వల్ల ఇది సెట్ కాలేదు. దాంతో కొరటాల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కమ్ బ్యాక్ అయిన  మణిశర్మని పిక్స్ చేసాడు. అయితే ఆచార్యకి  మిస్ అయిన అవకాశం లూసిఫర్ తో వచ్చిందని అంటున్నారు. మరి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడితే కానీ క్లారిటీ ఉండదు. అజయ్- అతుల్ గతంలో ఒకానొక తెలుగు సినిమాకి పనిచేశారు.

 

దర్శకుడిగా హరీష్ శంకర్ మొదటి చిత్రమైన షాక్ సినిమాకి వీరిద్దరు సంగీతం అందించారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలోని మధురం మధురం అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ కి సంగీతం అందిస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. సుజిత దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: