ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో  బయోపిక్ ల  హవా  ఎక్కువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖుల కు సంబంధించిన ఎంతో మంది ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎంతగానో పెంచి విశ్వవిఖ్యాత నటసార్వభౌమూడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించిన నందమూరి తారక రామారావు... సినీ రాజకీయ జీవితం గురించి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాలు పెంచేసింది. 

 


 క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో  నందమూరి బాలకృష్ణ నటించారు. ఇక ఈ సినిమాలోని సెకండ్ పార్ట్ మహానాయకుడు పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా అన్న విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని సంకల్పించి.. తెలుగు దేశం అనే పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రజలందరూ దేవుడిగా భావించే ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంతో ఆయన వెన్నంటే నడుస్తారు. ఇక పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే జాతీయ పార్టీలను సైతం వెనక్కి నెట్టి భారీ మెజారిటీ సాధించి అధికారాన్ని చేపడతారు ఎన్టీఆర్. 

 


 ఇలా ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎలా గడిచింది... ఆయన రాజకీయ జీవితంలో ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారు అనే విషయాన్ని ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో  చూపించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా మాత్రం ఎందుకో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం తమకు నచ్చిన విధంగానే సినిమాను తెరకెక్కించారని  అసలు నిజాలు చూపించలేదని ప్రేక్షకులు భావించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటన ను అంతగా జీర్ణించుకోలేకపోయారు ప్రేక్షకులు. దీంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: