తెలుగు చిత్ర పరిశ్రమ లో  నిన్నటి తరం నుంచి నేటి తరం వరకూ ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొన్ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు నాయకులు ఎలా ఉండాలో చెబితే మరికొన్ని సినిమాలు ఓటరు ఎలా ఉండాలో చెబుతాయి. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మెసేజ్ లు ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసాయి అని చెప్పాలి. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఓ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చిన్న హీరో సినిమా అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ మాత్రం తెలుగు ప్రేక్షకులని ఆలోచింపజేసింది. 

 


 ఆ సినిమా ఏదో కాదు ఆపరేషన్ దుర్యోధన. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ దుర్యోధన సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా అటు రాజకీయ నాయకులను ఇటు ఓటర్లను ఎంతగానో ఆలోచింపజేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్న శ్రీకాంత్ విధి నిర్వహణలో సక్రమంగా పని చేసినందుకు రౌడీలు అతని కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే... ఆ తర్వాత తన రూపురేఖలు మార్చుకుని రాజకీయ నాయకులను ఆకర్షించి వారి వద్ద సహాయకుడిగా చేరి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ  వాళ్లనే పక్కకునెట్టి తెరమీదికి వచ్చేస్తాడు. 

 


 ఇక ఎన్నో హామీలు కురిపిస్తూ ఉంటాడు శ్రీకాంత్. ఏకంగా హైదరాబాద్ కు  ఓడరేవు తెస్తాను అంటూ హామీ ఇస్తాడు కూడా. ఇలాంటి హామీ ఇచ్చిన అటు ఓటర్లు మాత్రం నమ్ముతూనే ఉంటారు. ఇలా రాజకీయ నాయకుల తీరు ఎలా ఉంటుంది... ఓటర్లు ఎలా రాజకీయ నాయకులను ఎన్నుకుంటారు అనే విషయాన్ని స్పష్టంగా ఈ  సినిమాలో చూపించి సంచలనమే సృష్టించారు శ్రీకాంత్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలన్నింటిలో ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: